ప్రయాణికులకు అలర్ట్ !! ఈ రైళ్ల ప్రయాణ సమయాలు మారుతున్నాయ్
నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు, వేళలను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్చుతున్నామని, అక్టోబరు 18వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానం చేరేందుకు ప్రస్తుత ప్రయాణ సమయం 10.35 గంటలు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు చేరుతుంది.
నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు, వేళలను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్చుతున్నామని, అక్టోబరు 18వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానం చేరేందుకు ప్రస్తుత ప్రయాణ సమయం 10.35 గంటలు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు చేరుతుంది. సవరించిన ప్రయాణ వేళల ప్రకారం రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై ఉదయం 8.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఇదివరకటి సమయంతో పోల్చితే సికింద్రాబాద్ నుంచి గూడూరుకు చేరుకోవడానికి అదనంగా 15 నిమిషాలు పడుతుంది. ఈ రైలు విజయవాడకు వేకువజామున 4.30కి బదులుగా 3.35కి చేరుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్‌షాక్ !! చివరికి ఏమైందంటే ??