గురక ప్రాణాంతకమా.. నిపుణుల హెచ్చరిక

Updated on: Oct 01, 2025 | 3:32 PM

నిద్రలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అందరి ఇళ్ళల్లో ఎవరో ఒకరు గురక సమస్యతో బాధపడుతుంటారు. కొందరికి తాము నిద్రలో గురుక పెడుతున్న విషయం కుటుంబసభ్యులు చెప్పేంత వరకు తెలుసుకోలేరు. గురుక పెడుతున్నావని చెబితే నమ్మరు కూడా. రాత్రి సమయంలో గురకపెట్టేవారి పక్కన నిద్రించే ఇతర కుటుంబసభ్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

గురకనే వైద్య పరిభాషలో అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా అంటారు. గురక అనేది ఒక సాధారణ శ్వాస రుగ్మత. నిద్రపోయే సమయంలో పెద్దగా వచ్చే శబ్ధంతో దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఈ గురక స్లీప్ ఆప్నియాకు సంకేతం కావచ్చు. ఇది గుండెపై ఒత్తిడిని పెంచి, గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. సాధారణ నిద్రగా భావించకుండా, అలసటగా అనిపిస్తే లేదా గురక తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొంతమంది నిద్రపోయిన వెంటనే గురక పెట్టేస్తారు. సాధారణంగా ఈ గురక మంచి నిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ, వైద్య నిపుణుల ప్రకారం, గురక ప్రాణాంతకం కావచ్చు. సాధారణ గురక సమస్య కానప్పటికీ, బిగ్గరగా గురక పెట్టేవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ గురక కారణంగా వయసుతో సంబంధంలేకుండా నిద్రలోనే మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి. బిగ్గరగా గురక పెట్టడం కొన్నిసార్లు స్లీప్ ఆప్నియాకు సంకేతం. స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి వాయు మార్గం ఇరుకుగా మారి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసి ప్రాణాంతకం కావచ్చని వైద్యులు పేర్కొన్నారు. స్లీప్ ఆప్నియా అధిక రక్తపోటు, స్ట్రోక్ మరియు ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా గురక వస్తున్నా లేదా నిద్ర తర్వాత అలసటగా అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను వెంటనే సంప్రదించండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: బాబోయ్‌ బంగారం ధర మోత మోగిపోతోంది..

రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ పక్షి జాడ కనిపెట్టారు..!

గుడ్డిగా కెరీర్‌ ఎంపిక. అంకుల్ సలహానే వేదం 90% స్టూడెంట్స్‌ దుస్థితి ఇదీ

గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత