ముళ్ళ కంపపై పడుకొని, గాలిలో కర్రకు వేలాడుతూ.. వింత జాతర

ముళ్ళ కంపపై పడుకొని, గాలిలో కర్రకు వేలాడుతూ.. వింత జాతర

Phani CH

|

Updated on: Oct 01, 2023 | 9:30 PM

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచార, వ్యవహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఇందులో గ్రామ దేవతల జాతరలు, ఉత్సవాలలో పాటించే సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగే మారెమ్మ జాతర చాలా విశిష్టమైనది. ఇందులో స్థానికులు ఆచరించే విధానాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అందులో భాగంగా ఆలయ పూజారి కుప్పగా వేసిన ముళ్ల కంపలపైనుంచి వెళ్లి అమ్మవారిని దర్శంచుకొని అనంతరం వాటిపైన పడుకొంటారు.

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచార, వ్యవహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఇందులో గ్రామ దేవతల జాతరలు, ఉత్సవాలలో పాటించే సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగే మారెమ్మ జాతర చాలా విశిష్టమైనది. ఇందులో స్థానికులు ఆచరించే విధానాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అందులో భాగంగా ఆలయ పూజారి కుప్పగా వేసిన ముళ్ల కంపలపైనుంచి వెళ్లి అమ్మవారిని దర్శంచుకొని అనంతరం వాటిపైన పడుకొంటారు. అంతేకాదు, ఓ పొడవాటి కర్రకు పూజారిని కట్టి, అత్యంత ఎత్తులో అతడిని గాలిలో తిప్పుతారు. ఈ జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. అందుకే ఈ జాతరను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని బెళుగుప్ప తాండాలో మారెమ్మ జాతర వైభవంగా జరిగింది. సీమ సిరిమానోత్సవంగా చెప్పుకునే ఈ జాతరకు స్థానిక గిరిజనులే కాకుండా, సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి గిరిజనులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. అమ్మ వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ కలశాలతో ఊరేగింపుతో ప్రారంభమైన ఈ జాతర సిరిమానోత్సవం వరకు సంప్రదాయబద్దంగా కన్నుల పండుగగా జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు చెదలపాలు..

వింతఘటన.. కందగడ్డకు అరటి గెల.. ఎక్కడంటే ??

ఐఫోన్‌ స్టోర్లపై యూత్‌ దాడి.. ఐఫోన్ల దోపిడీకి భారీ స్కెచ్

రైల్లో బెర్త్‌లు ఖాళీ లేవని.. ఓ ప్రయాణికుడి మాస్టర్ ప్లాన్ అదుర్స్

డేరింగ్ ఆపరేషన్.. మంటల్లో చిక్కుకున్న 35 మందిని కాపాడి