Watch Video: అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం పాత బస్టాండ్లోని శివాలయంలో ఆదివారం చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో దొంగలు శివాలయం వద్దకు వచ్చి డూప్లికేట్ తాళంతో ఆలయ గేటును తెరిచారు. అనంతరం హుండీకి ఉన్న తాళము కూడా డూప్లికేట్ తాళంతో తెరిచి, హుండీలో ఉన్న నగదును, అలాగే బీరువాలో ఉన్న 200 గ్రాముల వెండి వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు చూసి, ఆలయ పూజారికి తెలుపగా ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం పాత బస్టాండ్లోని శివాలయంలో ఆదివారం చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో దొంగలు శివాలయం వద్దకు వచ్చి డూప్లికేట్ తాళంతో ఆలయ గేటును తెరిచారు. అనంతరం హుండీకి ఉన్న తాళము కూడా డూప్లికేట్ తాళంతో తెరిచి, హుండీలో ఉన్న నగదును, అలాగే బీరువాలో ఉన్న 200 గ్రాముల వెండి వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు చూసి, ఆలయ పూజారికి తెలుపగా ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. హుండిలో అలాగే బీరువాలో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హుండీలో సుమారు రూ.15,000 నగదు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే బీరువాలో పోయిన వెండి వస్తువుల విలువ రూ.5,000 ఉండవచ్చని ఫిర్యాదులో తెలిపారు. అన్ని కలిపి ఒక రూ.20 వేల వరకు చోరీ జరిగి ఉండొచ్చని ఆలయ పూజారి పోలీసులకు తెలియజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…