పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

|

Mar 25, 2025 | 4:44 PM

నోరూరించే తియ్యని రుచులు పనస తొనల సొంతం. వేసవిలో ఎక్కువగా దొరికే పనస పండు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు. పనస పండులో విటమిన్లు ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

కానీ అందరూ పనస తొనలు తినకూడదు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎవరు వీటికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.. పనస పండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. మూత్రపిండాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది. కొంతమందికి పనస తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వ్యక్తులు దీనిని తినకూడదు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని పెంచే ప్రమాదం ఉంది కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ పండును తినకూడదు. ఇందులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. కొందరిలో జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవడం మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పనస ఎక్కువగా తినకూడదు. దీని వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు రావచ్చు. హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావచ్చు. పనస పండు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..

తుది తీర్పు !! సుశాంత్ మరణానికి జస్టిస్‌ ఇదేనా ??

కన్నప్ప ట్రోల్ చేసిన వారికి.. ఆ శివయ్య శాపం తగులుతుంది

పోలీసుల దెబ్బకు ఆగిపోయిన సుప్రీం హీరో సినిమా..

బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ ఇలా జరుగుతుంది.. ! సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా