AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్న శృతి హాసన్..

చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్న శృతి హాసన్..

Samatha J
|

Updated on: Nov 19, 2026 | 4:38 PM

Share

ఇండస్ట్రీలో తన కెరీర్ లైఫ్‌స్పాన్‌ను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకున్న శృతి హాసన్, లీడ్ రోల్స్ తగ్గినా, స్క్రీన్ ప్రెజెన్స్‌ను కోల్పోకుండా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక గీతాలు, కథను మలుపు తిప్పే సహాయక పాత్రలను ఎంచుకుంటూ, ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.

ఇండస్ట్రీలో ఒక స్టార్ కిడ్‌గా తన కెరీర్ పీక్ స్టేజ్‌ను, ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను శృతి హాసన్ చాలా ప్రాక్టికల్‌గా అర్థం చేసుకున్నారని ఆమె ఇటీవల ఎంచుకుంటున్న పాత్రలు స్పష్టం చేస్తున్నాయి. హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గుతున్న తరుణంలో, ఆమె కేవలం లీడ్ రోల్స్‌కే పరిమితం కాకుండా, తెరపై తన ఉనికిని చాటుకునేందుకు విభిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి భారీ చిత్రాలలో నటించినప్పటికీ, అందులో ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. అయినా సరే, స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఆమె ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అంతేకాకుండా, స్పెషల్ సాంగ్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాని మూవీ హాయ్ నాన్నలో తన డ్యాన్స్‌తో థియేటర్లలో అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు. అలాగే, ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో కూడా అద్భుతమైన స్పెషల్ మాస్ నెంబర్ చేశారు. ప్రత్యేక గీతాలతో పాటు, కథకు కీలకమైన సహాయక పాత్రలను చేయడానికి కూడా శృతి ఏమాత్రం వెనుకాడట్లేదు. గత ఏడాది వచ్చిన కూలిలో ఒక డిఫరెంట్, క్రూషియల్ రోల్ పోషించిన శృతి హాసన్, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార సినిమాలో కూడా కథకు ఎంతో అవసరమైన ఒక ముఖ్యమైన క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫేడవుట్ అయి ఇండస్ట్రీకి దూరమయ్యే కంటే, పాత్ర ఏదైనా సరే, నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడం కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ఆమె భావిస్తున్నారు. ఇలాంటి ప్రాక్టికల్ అడుగుల వల్లే శృతి హాసన్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ మార్కెట్‌లో రామాయణ జోరు.. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

బిగ్ బీకి మరోసారి బిగ్ వార్నింగ్

దుల్కర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన బన్నీ… అంతలా ఆ సినిమాలో ఏముంది?

హీరోయిన్లకు అగ్నిపరీక్ష… ఎవరికి కలిసొస్తుంది?

స్పెషల్ సాంగ్స్‌తో సీనియర్స్ సందడి.. కింగ్ కూడా రెడీనా?

Follow Us