ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా

Updated on: Aug 02, 2025 | 12:08 PM

ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడటం చాలా మందికి ఇప్పటికీ అలవాటు. కానీ అది ఆరోగ్యపరంగా అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఒకే సబ్బును వాడటం వల్ల అనేక అనారోగ్యాలు ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పాత రోజుల్లో ఇంట్లో ఒకే సబ్బు ఉండేది. అందరూ అదే వాడేవారు.

అయితే, అప్పట్లో అది పెద్ద విషయమేం కాదు. కానీ ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాముఖ్యత పెరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ తమ చర్మానికి తగిన సబ్బును వాడటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరి చర్మ స్వభావం వేరుగా ఉంటుంది కనుక.. అందుకు తగిన సబ్బు వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సబ్బులోని తడి నురుగు బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటుందని, దానికి తోడు చాలామంది స్నానం తర్వాత సబ్బును కడగకుండా అలాగే వదిలేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో.. చర్మ రోగాలున్న వారు వాడిన సబ్బును వేరొకరు వాడటం వల్ల.. ఇతరులకూ అవి సంక్రమించే ప్రమాదం ఉంటుందని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. వాడిన తర్వాత సబ్బును బాగా కడిగి ఆరబెడితే.. ఈ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చంటున్నారు వైద్యులు. ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోల్చితే.. సున్నితమైన చర్మం ఉన్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, పిల్లలకు, వృద్దులకు సబ్బు ద్వారా రోగాలు సంక్రమించే ప్రమాదం చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. సాధారణ సబ్బు కంటే లిక్విడ్ సోప్ వాడుకోవటం మంచిదని వారు సూచిస్తున్నారు. వేర్వేరు బాటిళ్లలో లిక్విడ్ సోప్ ఉంటే.. ఇక ఇలాంటి ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉండదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేయి పట్టి పైకి లాగారు.. అంతే.. స్టెప్పులతో ఇరగదీసింది

ఆ ఊరిలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఒక్కరూ బతికి లేరు.. అదే కారణమా?

ఇళ్ల‌కు తాళాలు వేయ‌రు.. క్రైమ్‌ రేట్‌ చాలా తక్కువ.. ఎక్కడంటే..?

సెల్ఫీ పిచ్చి ఎంత పని చేసింది.. ఎందుకు స్వామి వీళ్ళు ఇలా అయిపోతున్నారు

TOP 9 ET News: బాలయ్య సినిమాకు నేషనల్ అవార్డ్‌ | VD కెరీర్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్