“క్లయింట్ గా కాదు.. ఓ తండ్రిగా నా ఆవేదనను అర్థం చేసుకోండి వీడియో

Updated on: Sep 21, 2025 | 4:34 PM

2021లో క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తో షారూక్ ఖాన్ తీవ్ర ఆందోళన చెందారు. ఈ కేసు వాదించిన ముకుల్ రోహత్గి, షారూక్ ఖాన్ ప్రైవేట్ జెట్ ఆఫర్ చేసి తనను యూకే నుంచి రప్పించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. షారూక్ తనను క్లైంట్ గా కాకుండా తండ్రిగా అర్థం చేసుకోవాలని కోరారని రోహత్గి తెలిపారు. రెండున్నర రోజుల వాదన తర్వాత ఆర్యన్ కు బెయిల్ లభించింది.

2021 సంవత్సరంలో, ముంబై తీరంలోని ఒక క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం మరింత కలకలం రేపింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ లేకుండా దాదాపు నెల రోజులు ముంబై జైలులో గడిపారు. ఈ కాలంలో షారూక్ ఖాన్ ఎంతో ఆందోళన చెందారని తెలుస్తోంది. ఈ కేసును వాదించిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి, షారూక్ ఖాన్ ,వ్యక్తిగత జోక్యం గురించి  తెలిపారు. ఆ సమయంలో రోహత్గి యూకేలో హాలిడేలో ఉన్నారని, షారూక్ ఖాన్ వారిని త్వరగా ముంబైకి రప్పించేందుకు ప్రైవేట్ జెట్ ఆఫర్ చేసినట్లు తెలిపారు. అది కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కాలం కావడం గమనార్హం. రోహత్గి మొదట ఈ ఆఫర్ ని తిరస్కరించారు. కానీ, షారూక్ ఖాన్ రోహత్గి భార్యతో మాట్లాడి, తన కుమారుడి కేసులో తనను కేవలం ఓ క్లైంట్ గా కాదు, ఓ తండ్రిగా అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సంఘటన తర్వాత రోహత్గి కేసును వాదించడానికి సమ్మతించారు. షారూక్ ఖాన్ అన్ని వివరాలను రోహత్గి ముందుంచారు. రెండున్నర రోజుల కష్టపడిన వాదన తర్వాత, ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించింది.

మరిన్ని వీడియోల కోసం :

మీ వీధిలో బొంతలు కుట్టేవాళ్లు తిరుగుతున్నారా.. జాగ్రత్త వీడియో – TV9

ప్రభాస్ చిత్రంలో అభిషేక్ బచ్చన్? వీడియో

5 రూపాయలకే చొక్కా.. ఎగబడిన జనం..ట్విస్ట్‌ మాత్రం అదిరింది..- TV9

భలే కొట్టేశారు.. తిరిగి తెచ్చి అక్కడే పెట్టేశారు..ఎందుకంటే వీడియో

Published on: Sep 21, 2025 04:30 PM