AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత సూపర్ హిట్.. ఆలియాకు షాక్! లేడీ యాక్షన్ సినిమాల మార్కెట్‌కు రెండు భిన్న సంకేతాలు

సమంత సూపర్ హిట్.. ఆలియాకు షాక్! లేడీ యాక్షన్ సినిమాల మార్కెట్‌కు రెండు భిన్న సంకేతాలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 10, 2026 | 7:32 PM

Share

విమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాల మార్కెట్‌పై సమంత, ఆలియా భట్ సినిమాలు భిన్నమైన సంకేతాలు ఇచ్చాయి. 'మా ఇంటి బంగారం' బలమైన కథ, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తుంటే, భారీ అంచనాల మధ్య వచ్చిన 'ఆల్ఫా' మాత్రం నెగెటివ్ టాక్‌తో నిరాశపరిచింది. దీంతో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కంటెంట్‌దే అసలైన బలం అనే చర్చ మొదలైంది.

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు విమెన్ సెంట్రిక్ యాక్షన్ డ్రామాల ట్రెండ్ నడుస్తోంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్‌ విషయంలో రీసెంట్‌గా వచ్చిన రెండు సినిమాలకు డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సినిమా మేకర్స్‌కు భరోసా ఇస్తే, మరో సినిమా మాత్రం భయపెట్టింది. ఒక సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్‌గా నిలిస్తే, మరో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’, ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’.. ఈ రెండు ఫీమేల్ యాక్షన్ డ్రామాల రిజల్ట్స్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ లేడీ ఓరియంటెడ్ మార్కెట్‌కు మంచి భరోసా ఇచ్చింది. జూన్ 19న రిలీజైన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత సాధారణ గృహిణిగా మారిన స్వర్ణ పాత్రలో సమంత యాక్షన్ సీక్వెన్స్‌లకు థియేటర్లలో ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. మరోవైపు భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచి వచ్చిన ‘ఆల్ఫా’ మార్కెట్‌ను భయపెట్టింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో తొలి ఫీమేల్ లీడ్ మూవీగా జులై 3న ఈ సినిమా రిలీజ్ అయింది. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా పై రిలీజ్‌కి ముందు క్రియేట్ అయిన హైప్ అంతా ఇంతా కాదు. కానీ తీరా థియేటర్లలోకి వచ్చాక ఆడియన్స్ నుంచి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత మండే టెస్ట్‌లో కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఈ మూవీకి దాదాపు డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీద నెగెటివ్ ట్రోలింగ్ గట్టిగా జరుగుతోంది. కలెక్షన్స్ పరంగా చూస్తే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మా ఇంటి బంగారం’, మూడో వారంలోకి ఎంటరైనా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్‌తో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతూ సమంత రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అదే సమయంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆల్ఫా’ రిజల్ట్.. ఆలియా భట్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బలమైన కంటెంట్, ఎమోషన్ వర్కౌట్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని సమంత నిరూపిస్తే.. సరైన కంటెంట్ లేకుండా కేవలం క్యాస్టింగ్, బ్రాండ్ వాల్యూ మాత్రమే ఉంటే సరిపోదని ఆలియా భట్ సినిమా ప్రూవ్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

Follow Us