ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేస్తున్న సాయి పల్లవి
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సాయి పల్లవి నవంబర్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. నవంబర్ 6న పాన్ ఇండియా చిత్రం రామాయణ విడుదల కానుండగా, నవంబర్ 20న ధనుష్‌తో కలిసి నటించిన ఓం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాదాపు రెండేళ్లుగా సౌత్ ఆడియన్స్‌కు దూరమైన సాయి పల్లవి మళ్లీ తన వేగాన్ని పెంచారు. ఈ నవంబర్‌లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఒక గ్లోబల్ ప్రాజెక్టుతో పాటు సౌత్ సినిమాతోను ఆమె సందడి చేయనున్నారు.తండేల్ సినిమా తర్వాత సౌత్‌లో సాయి పల్లవి పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు, రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఆమె ఒకే నెలలో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సాయి పల్లవి నటించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణ నవంబర్ 6న విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో ఒక పెద్ద హిట్ కొట్టాలని సాయి పల్లవి ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. సౌత్‌లో, నవంబర్ 20న ధనుష్‌తో కలిసి నటించిన ఓం సినిమా రిలీజ్ కానుంది. మారి 2 తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్ళీ కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకే నెలలో, కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటంతో సాయి పల్లవి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో వేచి చూడాలి.
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

