రాజమండ్రి గామన్‌ బ్రిడ్జికి ఏమైంది ??

|

Mar 25, 2024 | 10:08 PM

తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్‌చెరువు నుంచి కొవ్వూరు వరకూ గోదావరిపై నిర్మించిన గామన్‌ బ్రిడ్జి మళ్లీ కుంగింది. 52వ పిల్లర్ జాయింట్‌ బేరింగ్‌ దగ్గర అర అంగుళం మేర కుంగిందని అధికారులు వెల్లడించారు. వంతెనకు యాక్షన్‌ ఇచ్చే బేరింగ్‌లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపుల వాహనాలకూ అనుమతివ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్‌చెరువు నుంచి కొవ్వూరు వరకూ గోదావరిపై నిర్మించిన గామన్‌ బ్రిడ్జి మళ్లీ కుంగింది. 52వ పిల్లర్ జాయింట్‌ బేరింగ్‌ దగ్గర అర అంగుళం మేర కుంగిందని అధికారులు వెల్లడించారు. వంతెనకు యాక్షన్‌ ఇచ్చే బేరింగ్‌లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపుల వాహనాలకూ అనుమతివ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఇప్పటికే గామన్ బ్రిడ్జి దగ్గరకు నిపుణుల బృందం సమస్యను పరిశీలించి మరమ్మత్తులు చేపట్టింది. గామన్‌ సంస్థ 2007లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ హైవేకు అనుసంధానంగా గోదావరిపై గామన్‌ బ్రిడ్జిని నిర్మించారు… 2015లో పుష్కరాల నిమిత్తం హడావుడిగా ప్రారంభించిన ఈ వంతెన.. ఆరంభంలోనే ఒకసారి కుంగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో మండిపోనున్న ఎండలు

పవర్ స్టార్ కూతురు క్యూట్ వీడియోకు సోషల్ మీడియా ఫిదా..

గుడ్ న్యూస్.. రంగస్థలం 2 స్పెషల్ సర్‌ప్రైజ్‌

పద్దతైన అమ్మాయిని.. ఇలా మార్చావ్‌ ఏంటయ్యా…

పుష్ప మేనియాతో ఊగిపోయిన.. IPL స్టేడియం

Follow us on