AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?

అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?

Phani CH
|

Updated on: Jun 10, 2026 | 10:14 AM

Share

అమెరికాలో రూ. కోటి జీతం అంటే భారీ సంపాదనగా భావిస్తారు. కానీ న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయుడు యశ్ శర్మ మాత్రం వాస్తవ చిత్రం భిన్నమని చెబుతున్నారు. పన్నులు, ఇంటి అద్దెలు, జీవన వ్యయాల కారణంగా ఆ సంపాదనలో పెద్ద భాగం ఖర్చవుతుందని వివరించారు. భారతదేశంలో తక్కువ జీతంతోనూ మెరుగైన జీవన ప్రమాణాలు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. కోట్లలో జీతం అనగానే భారతదేశంలో చాలామంది ఎంతో సంబరపడిపోతుంటారు. అయితే ఆ సంపాదన వెనుక ఖర్చుల గురించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. న్యూయార్క్‌ నగరంలో నివసిస్తున్న యశ్ శర్మ అనే భారతీయుడు ఇన్స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ప్రవాస భారతీయుల వాస్తవ ఆర్థిక పరిస్థితిని కళ్లకు కట్టింది. అమెరికాలో రూ. 1 కోటి ప్యాకేజీ వచ్చినా, అక్కడ ఉండే పన్నులు, అద్దెల భారంతో పోలిస్తే భారతదేశంలో తక్కువ జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉండవచ్చని యశ్‌ అన్నారు. యశ్ శర్మ తన వీడియోలో న్యూయార్క్‌లో లభించే రూ. కోటి రూపాయల ప్యాకేజీపై పడే పన్నుల భారాన్ని వివరంగా లెక్కకట్టారు. న్యూయార్క్‌లో నివసించే వారికి ఫెడరల్ టాక్స్, స్టేట్ టాక్స్, న్యూయార్క్ సిటీ టాక్స్‌తో పాటు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పన్నులు వర్తిస్తాయనీ సంపాదనలో 35 నుంచి 40 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వం ఖజానాకి వెళుతుందనీ, దీంతో చేతికి వచ్చే మొత్తం చాలా తక్కువని తెలిపారు. పన్నుల కోత తర్వాత మిగిలిన మొత్తం ఇళ్ల అద్దెలకే సరిపోతుందని యశ్ వివరించారు. న్యూయార్క్ లో లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుందనీ, ఈ భారీ ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే, అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ సంపాదించే వ్యక్తి కంటే, భారతదేశంలో 25 నుంచి రూ. 30 లక్షల వార్షిక ఆదాయం పొందే వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, విలాసవంతంగా, సంతోషంగా జీవించవచ్చని అభిప్రాయపడ్డారు. వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, కేవలం డాలర్లను రూపాయిల్లోకి మార్చి చూసే వారికి అక్కడి ఖర్చులు అర్థం కావని కామెంట్లు పెడుతున్నారు. సంపాదన కంటే జీవన వ్యయం చాలా ముఖ్యమని కొందరు అంటుండగా, న్యూయార్క్ అమెరికాలోనే అత్యంత ఖరీదైన నగరం కాబట్టి అమెరికా అంతటా ఇలాగే ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ, విదేశాలకు వెళ్లే వారికి అక్కడి పన్నులు, అద్దెలు నిజంగానే పెద్ద షాక్ ఇస్తాయనేది వాస్తవమని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ బుకింగ్‌కు కొత్త సిస్టమ్‌..!

తిడుతూ.. చితకబాదుతూ.. క్యాబ్ డైవర్ పై కాట్రాజ్‌ దౌర్జన్యం!

‘పెద్దిని వదలకుండా.. ఉండాల్సింది సరోజ్‌

Follow Us