రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Updated on: Nov 20, 2025 | 4:16 PM

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ పోస్టుల సంఖ్యను 2,569 నుండి 2,588కి పెంచింది. దరఖాస్తుల చివరి తేదీని డిసెంబర్ 10 వరకు పొడిగించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులలో నవంబర్ 25 నుండి ఎలాంటి రుసుము లేకుండా మార్పులు చేసుకోవచ్చు. డిసెంబర్ 13 నుండి 22 వరకు సవరణలకు అవకాశం ఉంది. పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు.

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల 2,569 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమైనాయి. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌బీ మరో కీలక ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటనలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో మార్పులు చేసింది. అలాగే దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసింది. జూనియర్‌ ఇంజినీర్‌, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించిన ఖాళీలలో జమ్మూ-శ్రీనగర్‌, చెన్నై రిజియన్ల పరిధిలోని ఖాళీలను ఆర్‌ఆర్‌బీ పెంచినట్లు ప్రకటనలో తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 2,588కి చేరింది. మరోవైపు దరఖాస్తు చివరి తేదీని కూడా మరో 10రోజులు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు ఎంచుకున్న ఆర్ఆర్‌బీ, పోస్టు ప్రాధాన్యత, రైల్వే జోన్‌,ప్రొడక్షన్‌ యూనిట్‌ ప్రాధాన్యతలను ఎటువంటి రుసుము చెల్లించకుండా సవరించుకోవచ్చు. ఈ సదుపాయం నవంబర్‌ 25 నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తు చివరి తేదీ వరకు సవరణకు అవకాశం కల్పించనుంది. అక్టోబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2,569 ఖాళీలున్నాయి. దానిలో చెన్నై రీజియన్‌లో 160 ఉండగా 169కు, జమ్మూ-శ్రీనగర్‌ రీజియన్‌లో 88కు బదులు 95 ఖాళీలను పెంచింది. నవంబర్‌ 30తో దరఖాస్తు ముగియనుండగా దానిని డిసెంబర్‌ 10 వరకు పొడిగించింది. డిసెంబర్ 10, 2025వ తేదీ రాత్రి 23.59 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు పేర్కొంది. ఇక డిసెంబర్‌ 13 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణకు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష తేదీలు త్వరలోనే ప్రకటించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షలు ఎప్పుడంటే

వలలో చిక్కిన వయ్యారి చేప.. ఆనందంలో జాలరి

ఢిల్లీ ఎర్రకోట పేలుడు.. సూసైడ్ బాంబర్ షూలోనే ట్రిగ్గర్ ??

పైరసీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే.. ఆ పని చేయాల్సిందే..

అల్లు అర్జున్‌తో పోటీ.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఏమన్నారు ??