పడగలో పల్లెలు.. పగబట్టినట్లు వరుసగా పాము కాట్లు

Updated on: Oct 06, 2025 | 11:00 PM

గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు పాముకాట్ల బెడదతో అట్టుడుకుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంతో పాముల సంచారం గణనీయంగా పెరిగి, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురు పాము కాటుకు గురై మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు తరచుగా పొలాల్లోనే ఉంటారు. చెప్పులు లేకుండా పని చేసే సమయంలో చాలామంది పాము కాట్లకు గురవుతున్నారు. నాగుపాము, కట్లపాము, రక్త పింజరి, పిట్ వైపర్ వంటి విషపూరిత పాములు ఈ ప్రాంతంలో అధికంగా సంచరిస్తున్నాయి. పాము కాటుకు గురైనప్పుడు నాటు వైద్యాలను ఆశ్రయించకుండా, గాయం కట్టకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని నిపుణులు, స్నేక్ సేవియర్ సొసైటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. సకాలంలో సరైన చికిత్స అందితే ప్రాణాలు కాపాడవచ్చని వారు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెద్ది అప్‌డేట్స్ విషయంలో సైలెన్స్‌

జోరు చూపిస్తున్న రాజాసాబ్‌.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్

గుడ్‌ న్యూస్‌ చెప్పిన గీతా గోవింద్‌

OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్

అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్