హైదరాబాద్‌లో ఇంటి అద్దెలకు రెక్కలు

Updated on: Sep 05, 2025 | 4:43 PM

హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌గా పేరున్న మాదాపూర్‌ లో ఐటీ కంపెనీల రాకతో ఎటు చూసినా అద్దాల మేడలు, అపార్టుమెంట్లు, గెటెడ్‌ కమ్యూనిటీలు వచ్చాయి. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉండటంతో ఉద్యోగుల నుంచి ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఒకప్పుడు సింగల్‌ బెడ్‌రూమ్‌ రూ 5వేలనుంచి 10వేల మధ్య ఉంటే ఇప్పుడు రూ.20 నుంచి 25వేలకు పెరిగింది.

వెయ్యి చదరపు అడుగుల 2బీహెచ్‌కే ఫ్లాట్‌ అద్దె నాలుగేళ్ల కిందటి వరకు రూ.23 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.35వేల వరకు ఉంది. ఇక్కడ ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఎక్కువ సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. ఖాజాగూడలో పేరున్న గేటెడ్‌ కమ్యూనిటీల్లో మూడు పడక గదుల ఇంటికి రూ.50వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త అపార్టుమెంట్లు అందుబాటులోకి రాకపోవడం అద్దెలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. గత ఐదేళ్లలో హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఇళ్ల అద్దెలు 50 శాతం పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ టూలెట్‌ బోర్డు కనిపించినా నాలుగైదు రోజుల్లో దిగిపోతున్నారు. నగరంలో బ్యాచిలర్లకు ఇల్లు అద్దెకు దొరకడం కష్టం. కానీ హైటెక్‌సిటీ ప్రాంతంలో వారికి ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఐటీ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యం. ఒక ఫ్లాట్‌లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు కలిసి ఉంటారు. అద్దె మొత్తాన్ని సమానంగా భరిస్తారు.ఉద్యోగులు ఉదయం కంపెనీలకు వెళ్లే రాత్రి ఎప్పుడో తిరిగివస్తారు. దీంతో నీటి వినియోగం తక్కువగా ఉంటుందని ఇళ్ల యజమానులు భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాసాల్లో ఫర్నిష్డ్‌ ఫ్లాట్లను అద్దెకు ఇస్తున్నారు. ఫర్నిష్డ్‌ ఫ్లాట్‌లో ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్‌ అంతా ఉంటుంది. బెడ్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్, ఓవెన్, స్టవ్, గీజర్లు, వాటర్‌ ఫిల్టర్ల వరకు కావాల్సినవన్నీ ఉంటాయి. కొద్ది నెలలు, ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే సిటీలో ఉండాలని వచ్చేవారు ఇలాంటి వాటికి మొగ్గుచూపుతున్నారు. అద్దె కాస్త ఎక్కువే ఉంటుంది. జస్ట్‌ సూట్‌కేస్‌తో ఇంట్లో దిగిపోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్వాక్రా మహిళలకు గుడ్‌ న్యూస్‌.. ఇక దశ తిరిగినట్లే

Gold Price: బంగారం ధర మరింత పైపైకి.. తులం ఎంతంటే