AP News: చెక్‌పోస్టు దగ్గరకు రాగానే బిత్తరచూపులు.. వణుకు.. అనుమానంతో చెక్ చేయగా.!

|

Mar 07, 2024 | 1:23 PM

చెక్‌పోస్టు వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏపీ పోలీసులు. అటుగా ఓ ట్రక్ వచ్చింది. వారిని చూడగానే ఆ ట్రక్ డ్రైవర్ బిత్తరచూపులు చూడటంతో పాటు వణికిపోయాడు. దెబ్బకు పోలీసులకు అనుమానమొచ్చింది. ఏమై ఉంటుందని చెక్ చేయగా..

ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం చెక్ పోస్టు వద్ద జరిగిన సాధారణ తనిఖీల్లో భారీగా ఎర్రచందనాన్ని పట్టుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలు విలువ చేసే మూడున్నర టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టీ.నర్సాపురం నుంచి ఢిల్లీకి అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ ఐచర్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గడిచిన కొన్ని నెలలుగా ఏపీ పోలీసులు, అటవిశాఖ అధికారులు పలు ప్రాంతాల్లో అక్రమ ఎర్ర దుంగల నిల్వలపై సంయుక్త దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

Published on: Mar 07, 2024 01:20 PM