పాక్‌ ఉగ్ర కుట్రలు.. బిర్యానీ,దావత్ కోడ్ తో..

Updated on: Nov 20, 2025 | 2:04 PM

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కుట్రలో ఫరీదాబాద్‌లో నలుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరు టెలిగ్రామ్‌లో 'బిర్యానీ' వంటి కోడ్ భాషను ఉపయోగించి పేలుడు పదార్థాలను, దాడులను ప్రణాళిక చేశారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఇమామ్ అహ్మద్ ఈ ముఠాకు సూత్రధారి కాగా, జైషే మహ్మద్‌తో సంబంధాలు బయటపడ్డాయి. డాక్టర్లను ర్యాడికలైజ్ చేసి, వారికి ఏకే రైఫిల్స్‌ను సరఫరా చేశారు.

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో దొరికిన నలుగురు ఉగ్రవాదులు టెలిగ్రామ్‌లో కోడ్ భాషలో మాట్లాడుకునేవారని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఇంట్లో వంట ఏంటి అంటూ మొదలుపెట్టి దావత్‌ కోసం బిర్యానీ వండాం అనే అర్థం వచ్చేలా కోడ్‌నేమ్‌లు ఉపయోగించారని తెలిసింది. టెలీగ్రామ్‌లో ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి.. నిఘా సంస్థలకు దొరక్కుండా ఉగ్రవాదులు జాగ్రత్తపడ్డట్లు తెలిసింది. పేలుడు పదార్థం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు బిర్యానీ అని చెప్పేవారట. ఇక ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మాట్లాడాల్సి వస్తే.. దావత్ అని చెప్పుకునేవారు. ఇక దాడి గురించి పేలుడు పదార్థం సిద్ధం అయిందని చెప్పేందుకు.. దావత్ కోసం బిర్యానీ రెడీ అయిందని అనేవారట. ఈ రెండు పదాలను హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కోడ్‌నేమ్‌లు ఉపయోగించినప్పటికీ హైదరాబాద్, తెలంగాణకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ ఉగ్ర ముఠాకు సూత్రధారి జమ్మూకాశ్మీర్‌లోని సోఫియా జిల్లాకు చెందిన ఇమామ్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఢిల్లీ ఎర్రకోట్ల ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీని.. 2020లో తన కుమారుడి చికిత్స కోసం కలిసాడు. అనంతరం నబీని ర్యాడికలైజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఆసుపత్రిలో చికిత్స నెపంతో కలుస్తుండేవారు. ఆ తర్వాత నబీ ఉగ్ర కార్యకలాపాలను చేయగలిగే డాక్టర్లను గుర్తించి.. వారిని అహ్మద్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. అలాంటి వారందరికీ అహ్మద్.. టెలీగ్రామ్‌లో ఉగ్రవాదం గురించి బ్రెయిన్ వాష్ చేసేవాడు. దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం.. అహ్మద్ ఉగ్రవాదులుగా మార్చిన వాళ్లంతా.. కాశ్మీర్‌లో ఓ చోట పాకిస్తాన్ ప్రేరేపిత జైషే ఉగ్ర సంస్థ ఉగ్రవాదులతో కలిశారు. ఈ సమావేశాన్ని అహ్మద్ ఏర్పాటు చేశాడు. అక్కడ కొత్త ఉగ్రవాదులకు జైషే సభ్యులు.. రెండు ఏకే సిరీస్ రైఫిల్స్ ఇచ్చారు. అందులో ఒకదానిని షాహీన్ షాహిద్ ఉపయోగించిన కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకెళ్లినకారు.. ఆ తర్వాత..

IPL 2026: ఐపీఎల్ 2026 వేలం ముహూర్తం ఫిక్స్..

అరె.. ముల్లు తీయడం ఇంత ఈజీనా.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక.. కష్టపడ్డానే

ఐ బొమ్మ రవి.. లైఫ్‌ స్టైల్‌ ఇదే !! డబ్బు సంపాదన అంటే ఎందుకంత కసి ??

తనూజ మాస్టర్ ప్లాన్.. దివ్య, భరణికి చెక్‌ మేట్‌