ఉత్తరాంధ్రకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ వీడియో

Updated on: Oct 05, 2025 | 10:29 AM

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాగల మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

దక్షిణ అంతర కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో