అన్నం తిన్నతర్వాత త్రేన్పులు వస్తున్నాయా ?? కారణం ఇదే కావచ్చు !!
అన్నం తిన్న వెంటనే కొంతమందికి తేన్పులు మొదలైపోతాయి. అజీర్తి సమస్య కూడా తలెత్తుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే… పొట్టలోని ఆమ్లం ఛాతివైపు ఎగబాకడం వల్ల పుల్లటి తేన్పులు వస్తుంటాయి. దీన్ని గాస్ట్రోపేరెసిస్ అంటారు. అపసవ్యమైన ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. వేళాపాళా లేకుండా తినడం వల్ల తిన్న తర్వాత పొట్టలో గ్యాస్, కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎసిడిటీ, తేన్పులు మొదలైపోతాయి.
అన్నం తిన్న వెంటనే కొంతమందికి తేన్పులు మొదలైపోతాయి. అజీర్తి సమస్య కూడా తలెత్తుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే… పొట్టలోని ఆమ్లం ఛాతివైపు ఎగబాకడం వల్ల పుల్లటి తేన్పులు వస్తుంటాయి. దీన్ని గాస్ట్రోపేరెసిస్ అంటారు. అపసవ్యమైన ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. వేళాపాళా లేకుండా తినడం వల్ల తిన్న తర్వాత పొట్టలో గ్యాస్, కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎసిడిటీ, తేన్పులు మొదలైపోతాయి. ఇలాంటి పరిస్థితిలో తిన్న తర్వాత పొట్ట ఉబ్బిపోతుంది కూడా. భోజనం తర్వాత ఈ సమస్య తలెత్తితే కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనాన్ని పొందవచ్చంటున్నారు నిపుణులు. అల్లం ముక్కలు ఈ సమస్యకు మంచి ఉపశమనం ఇస్తాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత అజీర్తి, కడుపు ఉబ్బరం వేధిస్తుంటే అల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని తినాలి. అంతేకాదు, అల్లాన్ని సలాడ్లలో కూడా కలుపుకోవచ్చు. అజీర్తి, త్రేన్పులకు మరో మంచి ఔషధం సోంపు. భోజనం తర్వాత పుల్లటి తేన్పులు, గ్యాస్ సమస్యలు తలెత్తితే సోంపు నమలడం ప్రయోజనకరంగా ఉంటుంది. సెలెరీ నీళ్లు కూడా కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి దోహదం చేస్తాయి. సెలెరీ అంటే కొత్తిమీరను పోలి ఉండే మొక్క. రాత్రి పడుకునే ముందు ఓ టేబుల్‌స్పూన్ సెలెరీ ఆకులను గ్లాసు నీళ్లలో వేసి మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల వెంటనే అజీర్తినుంచి ఉపశమనం దొరుకుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మా’ నుంచి హేమ సస్పెండ్ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటన
డెలివరీ తర్వాత నీళ్లు తాగకూడదా ?? తాగితే ఏమవుతుంది ??
Vijay Sethupathi: ఆమెతో రొమాంటిక్ సీన్స్‌లో నటించలేను