కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి
ఒకప్పుడు రాళ్లూ రతనాలు అమ్మిన రాయలసీమ.. నేడు కరువుసీమగా పేరుపొందింది. అయితే.. ఇది కరువు సీమ కాదని.. కనకపు సీమ అనిపించుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి బంగారం శుద్ధి కర్మాగారం రానుంది. ఆస్ట్రేలియాకు చెందిన జియోమైసూర్ సంస్థ.. తన భాగస్వాములైన డెక్కన్, త్రివేణి కంపెనీలతో కలిసి జొన్నగిరితో పాటు దాని పరిసర గ్రామాల్లో ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసింది.
రైతుల నుంచి భూసేకరణ.. కేంద్రం అనుమతులు.. గ్రామసభ తీర్మానాలు.. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు.. అన్నీ పూర్తిచేసుకుని ఈ ఏడాది చివరకు కర్మాగారంలో పనులు మొదలుపెట్టేందుకు జియోమైసూర్ సిద్ధమవుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడి రాయి, ఎర్రగుడి గ్రామాల రెవెన్యూ పరిధిలో 1550 ఎకరాల భూమిలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జొన్నగిరిలో బంగారం గనులున్న ఈ ప్రాంతంలో బంగారం వెలికితీత కోసం.. 320 కోట్ల రూపాయల విలువైన యంత్రాన్ని కొనుగోలు చేశారు. జియో మైసూర్ సర్వీస్ సంస్థ ప్రకారం ఈ ప్రాంతం తూర్పు బ్లాగులో భూమి అడుగున సుమారు 180 మీటర్ల లోతులో 6.8 మిలియన్ టన్నుల బంగారం ఖనిజం ఉన్నట్లు నిర్ధారించారు. 2040 వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి తీసుకున్న ఈ సంస్థ.. తర్వాత మరో 50 ఏళ్ల పాటు కూడా తవ్వకాలకూ ముందస్తు అనుమతులు పొందింది. ఈ జియా మైసూర్ ఏర్పాటుతో 350 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయని జియో మైసూర్ సంస్థ తెలిపింది. జొన్నగిరి ప్రాంతంలో మూడు దశాబ్దాల క్రితమే కేంద్రం పసిడి అన్వేషణ మొదలుపెట్టింది. ఇందుకోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ… జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల్లో పరిశోధనలు చేసి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తేల్చింది. అయితే వాటి వెలికితీతకు చాలా ఖర్చవుతుందనే ఉద్దేశంతో విరమించుకుంది. తర్వాత 2005లో జియోమైసూర్ రంగంలోకి దిగింది. ఏడాదికి 750 కిలోల పసిడి ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటయ్యే ఈ పరిశ్రమకు 2023లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభించాయి. ఈ ఏడాది పనులు ప్రారంభిస్తామని జియోమైసూర్ ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాన్స్ క్లాస్ నుంచి మహిళ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!
ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం