అయోధ్య వృద్ధిని అంచనా వేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్ సంస్థ

|

Jan 24, 2024 | 12:55 PM

దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం సాకారమైంది. గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరిన క్షణాలను యావత్‌ దేశం వీక్షించింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. దీంతో బాలరాముడిని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ఇలా నిత్యం 1 నుంచి 1.5లక్షల మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్ సంస్థ జెఫ్రీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది.

దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం సాకారమైంది. గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరిన క్షణాలను యావత్‌ దేశం వీక్షించింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. దీంతో బాలరాముడిని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ఇలా నిత్యం 1 నుంచి 1.5లక్షల మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్ సంస్థ జెఫ్రీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది. దీంతో దేశ పర్యాటక ముఖ చిత్రమే మారనుందని అభిప్రాయపడింది. దేశంలో నూతన పర్యాటక కేంద్రంగా అయోధ్య మారనుందని దేశ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు భావిస్తున్నాయి. రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ఏడాదికి 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ నివేదిక అంచనా వేసింది. నగరంలో కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టు, పునరుద్ధరించిన రైల్వేస్టేషన్‌, రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు కొత్త హోటళ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నట్లు తెలిపింది. మౌలిక సదుపాయాల వృద్ధితో పర్యాటకం మరింత పుంజుకోనుందని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: అదిరిన కేటీఆర్ కొత్త లుక్.. నెట్టింట ఫోటో వైరల్

తల్లి పక్కన పడుకుని మొబైల్‌లో కార్టూన్లు చూస్తున్న చిన్నారి.. ఒక్క సారిగా..

Hanuman: 10రోజులు 200 కోట్లు.. విధ్వంసకరంగా హనుమాన్ కలెక్షన్స్

Saindhav: అప్పుడే ఓటీటీలోకి సైంధవ మూవీ

లెక్కలు.. లొల్లులు పక్కకు పెడితే.. OTTలోకి ‘యానిమల్’ వస్తుందోచ్‌

Follow us on