AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ మామ.. క్రేజీ అల్లుడు.. మధ్యలో చిరంజీవి

మాజీ మామ.. క్రేజీ అల్లుడు.. మధ్యలో చిరంజీవి

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 28, 2026 | 7:39 PM

Share

అక్టోబర్‌లో దక్షిణాది సినీ అభిమానులకు భారీ బాక్సాఫీస్ పోరు ఎదురుకానుంది. రజినీకాంత్ ‘జైలర్ 2’, ధనుష్ ‘ఓం’, చిరంజీవి ‘విశ్వంభర’ దాదాపు ఒకే సమయంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మూడు భారీ చిత్రాలు తెలుగులోనూ విడుదల కానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ త్రిముఖ పోరులో బాక్సాఫీస్ విజేత ఎవరో అన్న ఉత్కంఠ ఇండస్ట్రీలో పెరుగుతోంది.

బాక్సాఫీస్ దగ్గర మాజీ మామా అల్లుళ్ల మధ్య జరగబోతున్న పోరులో గెలిచేది ఎవరు..? ఓవైపు రజినీకాంత్.. మరోవైపు ధనుష్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.. వీళ్ల మధ్యలో నేనున్నానంటూ మెగాస్టార్ కూడా రేసులోకి వచ్చేస్తున్నారు. మరి ఈ ముక్కోణపు పోరులో బాక్సాఫీస్ రారాజుగా నిలిచేది ఎవరు.. అసలు వీళ్లు ఏయే సినిమాలతో రాబోతున్నారు..? జైలర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్‌లో ఉండటంతో అక్టోబర్ 15న థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరొచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు ఆపలేరంటున్నారు రజినీ. కానీ ఆయనకు పోటీగా మాజీ అల్లుడే వస్తున్నాడు. ‘ఓం’తో అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలో సవాల్ విసురుతున్నారు ధనుష్. అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. చూస్తూ చూస్తూ రజినీ సినిమాకు ధనుష్ పోటీకి వస్తారో రారో అనుకున్న వాళ్ళందరికీ ఈ మాజీ అల్లుడు గట్టి షాక్ ఇస్తూ నేరుగా రేసులోకి దిగుతున్నాడు. జైలర్ 2, ఓం రెండూ తెలుగులోనూ రానున్నాయి.. ఇట్నుంచి చిరంజీవి తన ‘విశ్వంభర’ సినిమాతో అక్టోబర్ 16న ఎంట్రీ ఇస్తున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ మూడు బడా సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానులకు అసలైన పండగ రాబోతుంది. పైగా మూడేళ్ళ కింద భోళా శంకర్, జైలర్‌తో రజినీ, చిరు ఆల్రెడీ ఓసారి పోటీపడ్డారు.. ఆ లెక్క ఇప్పుడు సరి చేయాలని చూస్తున్నారు మెగాస్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Follow Us