జూపార్క్‌లో దారుణం.. దుప్పులను చంపేసిన కుక్కలు

Updated on: Nov 15, 2025 | 11:41 AM

కేరళలోని త్రిశూర్‌ పుత్తూరు జూలో దారుణం చోటుచేసుకుంది. నూతనంగా ప్రారంభించిన జూలో వీధికుక్కలు దాడి చేసి 10 దుప్పులను చంపేశాయి. నెలరోజులైనా గడవకముందే ఈ ఘటన జరగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల సందర్శనకు ఇంకా అనుమతి లేని ఈ జూ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నూతనంగా ప్రారంభించిన ఓ జూపార్క్‌లో దారుణ ఘటన జరిగింది. వీధికుక్కలు కొన్ని వెంటాడి జూలోని దుప్పులను చంపేశాయి. జూపార్క్‌ ప్రారంభమై నెలరోజులైనా గడవకముందే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై సందర్శకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కేరళ లోని త్రిసూర్‌ లో ఈ ఘటన జరిగింది. నగరంలో నూతనంగా ప్రారంభమైన పుతూర్‌ జూపార్కులో.. వీధి కుక్కలు వేటాడి 10 దుప్పుల ను చంపేశాయి. దుప్పల మృతి నేపథ్యంలో అటవీశాఖకు చెందిన అధికారులు జూపార్కుకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. కళేబరాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మాత్రమే దుప్పుల మరణానికి కచ్చితమైన కారణాలను చెప్పగలమని అన్నారు. కాగా పుతూర్‌ జూపార్కు సందర్శన కోసం ప్రజలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కేవలం స్కూళ్లు, కాలేజీల గ్రూపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే ప్రజా సందర్శనకు అనుమతించే తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ జూ దేశంలోనే రెండో అతిపెద్ద జూగా, దేశంలోనే అతిపెద్ద డిజైనర్ జూగా గుర్తింపు పొందింది. కాగా పుతూర్‌ జూపార్కును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అక్టోబర్ 28న ప్రారంభించారు. మొత్తం 80 జాతులకు చెందిన 534 జంతువులకు ఆవాసం కల్పించేలా ఈ జూను డిజైన్‌ చేశారు. ఇందులో 23 సహజ ఎన్‌క్లోజర్స్‌ ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళ్యాణకట్టలో ఉద్యోగాలంటూ బురిడీ కొట్టించిన లేడీ కిలాడీ

లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో

ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం

Telangana: రైతన్నలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్