YS Sharmila: కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో వైఎస్ షర్మిల ప్రమాణస్వీకారం.. ప్రసంగంపై ఉత్కంఠ.. లైవ్ వీడియో

|

Jan 21, 2024 | 11:20 AM

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త సారధి.. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, AICC కార్యదర్సులు మునియప్పన్, కృష్టఫర్ తిలక్ హాజరుకానున్నారు. షర్మిల ప్రమాణస్వీకారానికి కానురులో ఆహ్వానం ఫంక్షన్ హాల్‌ వేదిక కాబోతుంది. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరి విజయవాడ పార్టీ ఆఫీస్‌ ఆంధ్ర రత్న భవన్‌లో అధ్యక్షహోదాలో బాధ్యతలు తీసుకుంటారు.

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త సారధి.. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, AICC కార్యదర్సులు మునియప్పన్, కృష్టఫర్ తిలక్ హాజరుకానున్నారు. షర్మిల ప్రమాణస్వీకారానికి కానురులో ఆహ్వానం ఫంక్షన్ హాల్‌ వేదిక కాబోతుంది. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరి విజయవాడ పార్టీ ఆఫీస్‌ ఆంధ్ర రత్న భవన్‌లో అధ్యక్షహోదాలో బాధ్యతలు తీసుకుంటారు. ప్రమాణస్వీకార అనంతరం షర్మిల ఏం మాట్లాడబోతున్నారు? ఆమె ప్రసంగం ఎలా ఉండబోతుంది? తొలి ప్రసంగంతోనే కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపుతారా? పార్టీకి జవసత్వాలు నింపేలా ప్రసంగం ఉండబోతుందా? భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వబోతున్నారా? షర్మిల ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.

నిన్న ఇడుపులపాయ వెళ్లిన షర్మిల.. తండ్రి సమాధి దగ్గర నివాళి అర్పించారు. షర్మిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లా పార్టీలో చేరారు. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్‌ లో చేరబోతున్నారని తెలుస్తోంది. వైఎస్సార్ ఆత్మసాక్షిగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు షర్మిలకు రాజకీయ గురువు కాబోతున్నారనే టాక్ వినిపిస్తుండగా, CWC సభ్యులు రఘువీరా.. షర్మిల ద్వారా చక్రం తిప్పబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..