Weekend Hour: గోదారి తీరంలో రసవత్తరంగా ఏపీ రాజకీయం.. పవన్ వర్సెస్ వైసీపీ

|

Jun 17, 2023 | 6:58 PM

గోదారి తీరంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. వారాహి యాత్రలో భాగంగా అధికారపార్టీపై పవన్‌ కల్యాణ్‌ విమర్శల డోసు పెంచితే.. అంతే స్పీడుగా కౌంటర్లు బుల్లెట్‌ స్పీడుతో దూసుకొస్తున్నాయి. యాత్రకు ముందు వరకూ పొత్తులుంటాయన్న పవన్‌.. ఇప్పుడు ఒక్కఛాన్స్‌ అంటున్నారు. అడుక్కుంటే కాదు. జనం ఓట్లేసేలా మెప్పించడం తెలుసా అంటూ ప్రశ్నించారు వైసీపీ నాయకులు. ఇక కృష్ణా తీరం నుంచి గోదారి వరకూ చెప్పుల పంచాయితీ చేరింది.

ఒక్కఛాన్స్‌.. దేవుడి సాక్షిగా అడుగుతున్నా.. ఒక్కసారి సీఎం చేయండి… వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ ప్రజలు ముందుంచుతున్న విజ్ఞప్తి. ప్రజల స్పందన అటుంచితే వైసీపీ నుంచి రియాక్షన్స్‌ మాత్రం ఫుల్‌ స్పీడుగా వస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి అడుక్కుంటే రాదని… ప్రజలు ఓట్లేస్తేనే వస్తుందంటూ కౌంటర్స్‌ వేస్తున్నారు. ఛాన్స్‌ ఇవ్వాలంటే ప్రజల్లో విశ్వాసం కల్పించాలన్నారు మంత్రి దాడిశెట్టి రాజా. యజమాని చెప్పకుండా ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తేల్చుకోలేని పవన్‌ కల్యాణ్‌ సీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేశారు. పూటకో వ్యూహం మారుస్తున్న పవన్‌ తీరుపై తప్పుబట్టారు మంత్రి.

Published on: Jun 17, 2023 06:57 PM