మీ డబ్బు కాదు.. పరామర్శ కావాలి
తమిళ స్టార్ హీరో, టవీకే అధినేత విజయ్‌కి బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు విజయ్ నష్టపరిహారంగా నగదు పంపించారు. అయితే ఆ డబ్బు తమకు అవసరం లేదంటూ ఓ బాధితురాలు తిప్పిపంపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తమిళ స్టార్ హీరో, టవీకే అధినేత విజయ్‌కి బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు విజయ్ నష్టపరిహారంగా నగదు పంపించారు. అయితే ఆ డబ్బు తమకు అవసరం లేదంటూ ఓ బాధితురాలు తిప్పిపంపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం తరఫున మృతుల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షల చొప్పున అక్టోబరు 18న జమచేశారు. మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ సొమ్మును తిప్పి పంపారు. విజయ్ నేరుగా వచ్చి తమను ఓదారుస్తారని వీడియో కాల్‌లో మాట్లాడారు. తాను రావడానికి ముందు ఆర్ధికసాయం తీసుకోవాలని చెప్పారని, అయితే తమకు డబ్బు ముఖ్యం కాదని, తాము విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని చెప్పారు. తాము విజయ్ ఆహ్వానంతో సమావేశానికి వెళ్లలేదని, తమ పేరుతో తమ బంధువులు ఆ సమావేశానికి వెళ్లారని సంఘవి పేర్కొన్నారు. తమను సంప్రదించకుండానే తమ ఖాతాలో జమచేసిన రూ.20 లక్షల మొత్తాన్ని విజయ్ కార్యాలయానికే తిరిగి పంపామని ఆమె వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీరం దాటిన మొంథా తుఫాను.. అల్లకల్లోలంగా సముద్రాలు
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే ??
రైలు నుండి జారిపడిన యువకుడు.. క్షణంలో..
వామ్మో.. ఈ దున్నపోతు ధర రూ.23 కోట్లట !! ఈ గుర్రం ధర రూ.15 కోట్లట
