AP News: విజయ్ సాయి రెడ్డి ట్వీట్‌కి నారా లోకేశ్ కౌంటర్ అటాక్

AP News: విజయ్ సాయి రెడ్డి ట్వీట్‌కి నారా లోకేశ్ కౌంటర్ అటాక్

Ram Naramaneni

|

Updated on: Sep 23, 2023 | 12:45 PM

ఏపీలో ట్విట్టర్ వార్ నడుస్తుంది. వైసీపీ నేత విజయ సాయి ట్వీట్‌కు ఘాటైన రిప్లై ఇచ్చారు టీడీపీ నేత లోకేశ్. . నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని.. జైలులో ఉండాల్సిన జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉంటే..జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్‌ జైలులో ఉన్నారని ట్వీట్‌‌లో రాసుకొచ్చారు లోకేశ్. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

విజయసాయిరెడ్డి ట్వీట్‌కి లోకేష్‌ కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. బెయిల్‌డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్‌ అంటూ సెటైర్ వేశారు. వేలకోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసులో A1 జగన్ అని పేర్కొన్నారు. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్‌ అన్న లోకేశ్.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఫైరయ్యారు. నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని.. జైలులో ఉండాల్సిన జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉంటే..జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్‌ జైలులో ఉన్నారని ట్వీట్‌‌లో రాసుకొచ్చారు లోకేశ్.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 23, 2023 12:45 PM