Pawan Kalyan: గద్దర్ నాతో చెప్పిన ఆఖరి మాటలు ఇవే.. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వెల్లడి
విశాఖలో మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. దేశంలో 60 శాతం యువతది ప్రధానమని.. వారిని సరైన దారిలో నడిపించే నాయకత్వం కావాలని గద్దర్ చివరి మాటగా చెప్పారని గుర్తుచేసుకున్నారు.
ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్ తనకు స్ఫూర్తిని కలిగించే కొన్ని అంశాలను చివరి మాటలుగా చెప్పినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. విశాఖలో మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. దేశంలో 60 శాతం యువతది ప్రధానమని.. వారిని సరైన దారిలో నడిపించే నాయకత్వం కావాలని చెప్పారని గుర్తుచేసుకున్నారు. తన ద్వారా యువతకు సరైన నాయకత్వం లభించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తంచేశారని పవన్ చెప్పారు. ఎంతో మంది త్యాగఫలం దేశానికి స్వాతంత్రమని పవన్ వ్యాఖ్యానించారు.
Published on: Aug 10, 2023 10:26 PM