Kuppam Tension : కుప్పంలో మళ్లీ టెన్షన్ టెన్షన్ ..!

Kuppam Tension : కుప్పంలో మళ్లీ టెన్షన్ టెన్షన్ ..!

Anil kumar poka

|

Updated on: Jan 04, 2023 | 1:25 PM

ఓవైపు భారీ ర్యాలీ, రోడ్ షో కోసం టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తే.. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు.

ఓవైపు భారీ ర్యాలీ, రోడ్ షో కోసం టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తే.. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతిపురం మండలం కేనుమాను పల్లిలో రచ్చబండ కోసం చేసిన ఏర్పాట్లను కూడా పోలీసులు తొలగించారు. సభ నిర్వహణకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. కాసేపట్లో శాంతిపురం మండలం పెద్దూరు నుంచి రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని ఘటనల కారణంగా ర్యాలీలు, రోడ్ షో లను ప్రభుత్వం నిషేదించింది. దీనికి సంబంధించి టీడీపీ కుప్పం ఆఫీస్ ఇన్‌ఛార్జ్‌కి నోటీసులు కూడా ఇచ్చామని చెప్తున్నారు అధికారులు. కొద్ది సేపటి క్రితమే కుప్పం టీడీపీ ఆఫీస్ ఇంచార్జ్‌ను పిలిపించిన పోలీసులు.. జీవో ప్రకారం నడుచుకుంటామని రాసి ఇవ్వాలని కోరారు. ప్రచార రథాల వాహనాలకు మైక్ కనిపిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పలమనేరు సమీపంలో వాహనాలు కనిపించడంతో అడ్డుకున్నారు పోలీసులు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ర్యాలీ నిర్వహిస్తారా.. లేదంటే పోలీస్ రూల్స్ ఫాలో అవుతారా.. లేదా అనేది టెన్షన్ రేకెత్తిస్తోంది.

Published on: Jan 04, 2023 01:21 PM