Telangana: వివాదంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. సెక్యూరిటీతో విచ్చలవిడిగా ఫొటోషూట్స్- Watch Video

| Edited By: Janardhan Veluru

Jul 13, 2023 | 7:15 PM

Telangana News: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న రోహిత్ రెడ్డికి వై కేటగిరి సెక్యూరిటీని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ సెక్యూరిటీ సిబ్బందిని ఫోటోషూట్ల కోసం పైలెట్ రోహిత్ రెడ్డి వాడుకోవడం వివాదాస్పదంగా మారింది.

Pilot Rohit Reddy: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న రోహిత్ రెడ్డికి వై కేటగిరి సెక్యూరిటీని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ సెక్యూరిటీ సిబ్బందిని ఫోటోషూట్ల కోసం పైలెట్ రోహిత్ రెడ్డి వాడుకోవడం వివాదాస్పదంగా మారింది. సెక్యూరిటీ సిబ్బందితో రోహిత్ రెడ్డి ఫోటో షూట్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భద్రత కోసం కల్పించిన సెక్యూరిటీతో విచ్చలవిడిగా రోహిత్‌రెడ్డి ఫోటోషూట్లు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పార్టీలు, పబ్బుల్లోనూ సెక్యూరిటీతో రోహిత్‌ హల్‌చల్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Published on: Jul 13, 2023 07:12 PM