Watch Video: ఓటమి భయంతో రేవంత్, కేసీఆర్ తొండాట.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Lok Sabha Polls 2024: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచేది బీజేపీనే అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రజా మద్ధతు రోజురోజుకీ పెరుగుతోందన్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. బుధవారంనాడు కాచిగూడలో గల్లీగల్లీ తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీవీ9తో మాట్లాడుతూ ఓటమి భయంతో రేవంత్, కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచేది బీజేపీనే అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రజా మద్ధతు రోజురోజుకీ పెరుగుతోందన్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. బుధవారంనాడు కాచిగూడలో గల్లీగల్లీ తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీవీ9తో మాట్లాడుతూ ఓటమి భయంతో రేవంత్, కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. చీప్ ట్రిక్స్‌తో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ మాటలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. దేశానికి సంబంధించిన ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, మోదీకే ఓటు వేస్తామని రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు.