Telangana Elections: బీఆర్ఎస్, మజ్లిస్‌, బీజేపీ ఒక్కటే.. జహీరాబాద్‌ సభలో ప్రియాంక వ్యాఖ్యలు-Watch Video

|

Nov 28, 2023 | 3:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేశారు ప్రియాంకా గాంధీ. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, బీజేపీ ఒక్కటేనని ఆమె అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేశారు ప్రియాంకా గాంధీ. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, బీజేపీ ఒక్కటేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Published on: Nov 28, 2023 03:45 PM