Watch Video: మంత్రి కేటీఆర్ వాహనాన్ని చెక్ చేసిన పోలీసులు, ఎన్నికల సిబ్బంది

| Edited By: Janardhan Veluru

Nov 01, 2023 | 2:19 PM

Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ఉధృతం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా విలువ చేసే నగదు, లిక్కర్, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ఉధృతం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా విలువ చేసే నగదు, లిక్కర్, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా మంత్రి కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న కేటీఆర్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపారు. వాహనంలో తనిఖీ చేశారు. కేసీఆర్ తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Published on: Nov 01, 2023 02:14 PM