Telangana Elections 2023: తెలంగాణలో రాజకీయ రణక్షేత్రం రోజు రోజుకు పీక్స్‌కు చేరుతుంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టాప్ టు బాటమ్ నేతలంతా గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల అగ్రనేతలు ప్రచారంలోకి దిగుతున్నారు. ఇవాళ మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లలో జరిగే కార్నర్ మీటింగ్స్‌లో ఖర్గే పాల్గొని మాట్లాడనున్నారు. ఎలాగైనా గెలవాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ.. వరుసగా సభలు నిర్వహించనుంది.
జాతీయ పార్టీ నేతల ప్రచారంపై భారీ ఆశలు పెట్టుకుంది రాష్ట్ర నాయకత్వం. విడతల వారిగా అగ్రనేతలను ప్రచారంలోకి దింపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..