Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీ కుమార్‌.. భద్రత పెంపు..

|

Dec 03, 2023 | 12:43 PM

ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిపాత్యం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను సులభంగా చేరుకోనుందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు పుష్పగుచ్చం అందించిన అంజనీ కుమార్‌.. రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు...

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం స్పష్టమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిపాత్యం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను సులభంగా చేరుకోనుందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు పుష్పగుచ్చం అందించిన అంజనీ కుమార్‌.. రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు మెజారిటీ స్పష్టమవుతోన్న తరుణంలో రేవంత్‌ ఇంటి వద్ద భద్రతసైతం పెంచారు. రేవంత్‌ ఇంటికి కార్యకర్తలు క్యూ కడుతుండడంతో భద్రతను పెంచారు. అంజనీ కుమార్‌ వెంట మహేష్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌ సైతం వచ్చారు.