Telangana Assembly: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీలో దుమ్ముదుమారం.. లైవ్ వీడియో

|

Aug 01, 2024 | 1:50 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో యువతకు సంబంధించిన స్కిల్‌ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు మంత్రి శ్రీధర్‌బాబు.. కాగా.. అసెంబ్లీలో నిన్న వాడీ వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే.. ఇవాళ కూడా బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో యువతకు సంబంధించిన స్కిల్‌ వర్సిటీ బిల్లుపై మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు. అనంతరం ఈ విషయంపై అసెంబ్లీలో చర్చజరిగింది. కాగా.. అసెంబ్లీలో నిన్న వాడీ వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో నేడు తెలంగాణవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.. అసెంబ్లీలో సబితపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు అసెంబ్లీలో కూడా ఇదే విషయంపై ఇవాళ చర్చించాలని.. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలను బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.. కాగా.. దీనిపై సీఎం రేవంత్ కూడా స్పందించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌ తీరుపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి.. అంశాలవారీగా చర్చల్లో ప్రతిపక్షం పాల్గొనాలని సూచించారు. ప్రతిపక్షం ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థం కావట్లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on