Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ

Updated on: Mar 13, 2025 | 10:04 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం రెండోరోజు ప్రారంభమయ్యాయి.. బుధవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఇవాళ సభ్యులు చర్చించనున్నారు. ఈనెల 27వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. హోలీ సందర్భంగా శుక్రవారం సభకు సెలవు ప్రకటించారు. మిగతా రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం రెండోరోజు ప్రారంభమయ్యాయి.. బుధవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఇవాళ సభ్యులు చర్చించనున్నారు. ఈనెల 27వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. హోలీ సందర్భంగా శుక్రవారం సభకు సెలవు ప్రకటించారు. ఈనెల 19న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈనెల 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. 21వ తేదీ నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుండగా.. ఈనెల 27 వరకు పలు పద్దులపై చర్చ కొనసాగుతాయి. అదేరోజు సభ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. మొత్తంగా 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కాగా.. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై  ప్రభుత్వం.. విపక్షాల మధ్య చర్చ జరగనుంది.

Published on: Mar 13, 2025 09:58 AM