Telangana Assembly: తగ్గేదేలే.. వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ.. లైవ్

|

Mar 18, 2025 | 11:47 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదోరోజు మంగళవారం కొనసాగుతున్నాయి.. ఇవాళ సభ ముందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు రానుంది.. SC వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదోరోజు మంగళవారం కొనసాగుతున్నాయి.. ఇవాళ సభ ముందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు రానుంది.. SC వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు.. అలాగే దీనిపై సుధీర్ఘ చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం (మార్చి19న) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

కాగా.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు, విద్య, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పించే బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, తెలంగాణ ఎండోవ్‌మెంట్‌ యాక్ట్ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది అసెంబ్లీ.. కాగా.. ఇవాళ అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణపై సుధీర్ఘ చర్చ జరగనుంది.

Published on: Mar 18, 2025 11:25 AM