Telangana Assembly: దుమ్ముదుమారమే.. తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశాలపై నాన్‌స్టాప్ చర్చ.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.. తెలంగాణ మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. భూభారతి బిల్లులతోపాటు వీటిపై చర్చ జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.. తెలంగాణ మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు.. భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది.. దీంతోపాటు రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.. ప్రభుత్వ అప్పులు, చెల్లింపులు.. రైతు భరోసాపై చర్చించనున్నారు..
ధరణికి బై బై.. సరికొత్తగా భూభారతి బిల్లు
ధరణి స్థానంలో రేవంత్ సర్కార్ సరికొత్తగా భూభారతి బిల్లును తీసుకువచ్చింది.. ROR చట్టం–2020 స్థానంలో ROR-2024 బిల్లు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. తహశీల్దారు, RDO, కలెక్టర్ స్థాయిలోనే భూసమస్యలకు పరిష్కారం చూపుతామంటోంది.. భూభారతి బిల్లుపై ఇవాళ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరగనుంది.
ఇదిలాఉంటే.. భూ భారతి, రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.. ఈ క్రమంలో గంట ముందే అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు..