Watch Video: చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

|

Apr 01, 2024 | 1:55 PM

సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విజయ సాయి రెడ్డి టీవీ9తో మాట్లాడారు.

నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సామావేశంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విజయ సాయి రెడ్డి టీవీ9తో మాట్లాడారు. నీతిమాలిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేసింది చంద్రబాబు వర్గం వారు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చే విధంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వమనున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో ఎవరైనా పుడతారా అని హేళన చేసిన చంద్రబాబు కుల మతాలకు తావు లేకుండా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి‎పై విషం కక్కుతున్నారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 01, 2024 01:54 PM