ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తూనే వీణ లీక్స్

Updated on: Jan 31, 2026 | 4:12 PM

ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న వీణ లీక్స్ వివాదం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వాటిని చేసిన వీణ ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇద్దరిపై కేసులు నమోదవ్వగా, జనసేన, వైసీపీ నేతలు స్పందించారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలపై చర్చ జరుగుతోంది.

ఏపీ రాజకీయాల్లో వీణ లీక్స్ వివాదం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అలాగే ఆ ఆరోపణలు చేసిన వీణ ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి ఆచూకీ కనిపించకపోయినా, సోషల్ మీడియాలో వీడియోలు, వారి వెర్షన్లు వైరల్ అవుతున్నాయి. శ్రీధర్‌ను వివరణ ఇవ్వాలని జనసేన అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. డీప్ ఫేక్ వీడియోలతో తనను బద్నామ్ చేశారని ఆయన వర్గం వాదిస్తోంది. మరోవైపు, వీణపై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. ఒక జర్నలిస్టుపై దాడికి సంబంధించి, అలాగే ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలపై రైల్వే కోడూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు

కోఠి ఎస్‌బీఐ వద్ద బుల్లెట్ల మోత.. ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగింది

TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్

Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట

Ram Charan: సినిమాల రేసులో వెనకబడుతున్న చరణ్