భారత్ జోడో యాత్రలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విసుర్లు(Video)
సావర్కర్ బ్రిటీష్ అధికారికి రాసిన లేఖ తన వద్ద ఉందని, దానిని తాను చదివానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్ ఆ లేఖలో రాశారని..
మహారాష్ట్రలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 11వ రోజు కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన ప్రకటనను పునరుద్ఘాటించారు. సావర్కర్ బ్రిటీష్ అధికారికి రాసిన లేఖ తన వద్ద ఉందని, దానిని తాను చదివానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్ ఆ లేఖలో రాశారని.. కావాలంటే ఈ ఉత్తరం మీరు ఇది చదవండి.. అంతేకాదు ఫడ్నవీస్ దీనిని చూడగలరు. మోహన్ భగవత్ కి కూడా తన వద్ద ఉన్న ఉత్తరాన్ని చూపించండి.. సావర్కర్ .. బ్రిటీష్ వారికి సహాయం చేశాడని ఈ ఉత్తరం స్పష్టం చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published on: Nov 18, 2022 08:31 AM