PM Modi: ప్రజల ఇబ్బందులు స్వయంగా చూశా.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ..!(వీడియో)

|

Oct 06, 2021 | 8:30 PM

ప్రపంచం దృష్టిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావడం చాలా పెద్ద విషయం కావచ్చు.. కానీ తన దృష్టిలో ప్రజా సేవ కోసం ఏదైనా చేయడానికి మార్గాలను అన్వేషించడమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీంతోపాటు ప్రతి యువకుడు అవకాశాలు పొందడం ముఖ్యం..

ప్రపంచం దృష్టిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావడం చాలా పెద్ద విషయం కావచ్చు.. కానీ తన దృష్టిలో ప్రజా సేవ కోసం ఏదైనా చేయడానికి మార్గాలను అన్వేషించడమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీంతోపాటు ప్రతి యువకుడు అవకాశాలు పొందడం ముఖ్యం.. అయితే.. యువత వేరే వారిపై ఆధారపడకుండా.. స్వయం శక్తితో తమ కలలను చేరే విధంగా సిద్ధం చేయడమే తన లక్ష్యమని అన్నారు. రెండు దశాబ్దాల ప్రజా ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఒపెన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రధాని మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 2014 వరకు కొనసాగారు. వరుసగా.. మూడు సార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం 2014లో ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టి రెండోసారి కూడా మోదీ కొనసాగుతున్నారు. ఈ విస్తృతమైన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి గాంధీనగర్ నుంచి న్యూఢిల్లీకి తన ప్రయాణం, పరిపాలనా సవాళ్లు, ప్రపంచం మొత్తం భారత్ వైపు దృష్టిసారించేలా చేయడంలో తన పాత్ర, తదితర అంశాలపై మాట్లాడారు.

తన రాజకీయ ప్రవేశం అయాచితంగా జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. తన ప్రపంచం మొత్తం భిన్నంగా ఉండేదని.. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో గడిపేవాడినని తెలిపారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ప్రతిపాదించిన ‘జన్ సేవా హి ప్రభు సేవా’ తన మార్గమని మోదీ స్పష్టంచేశారు. ఎల్లప్పుడూ తనకు అవే ప్రేరణ, మార్గదర్శకాలని పేర్కొన్నారు. తాను ఏమి చేసినా.. అవే కారణమని.. తిరుగులేని విధంగా తన జీవితాన్ని మలుపు తిప్పాయని పేర్కొన్నారు. చాలా కాలం తరువాత మారిన పరిస్థితులు, కొంతమంది స్నేహితుల ఒత్తిడి మేరకు తాను రాజకీయాల్లో చేరానంటూ పేర్కొన్నారు. 2001లో గుజరాత్‌ భూకంపం సమయంలో తలెత్తిన ప్రతికూల పరిస్థితులు తనలో ఉన్నతమైన ఆలోచనలకు పునాది వేశాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశానని తెలిపారు.

భారత సమాజం తన చుట్టూ ఉన్న ప్రజలే తనను టీ అమ్మే స్థాయి పేదరికం నుంచి దేశప్రధాని స్థాయికి తీసుకెళ్ళారని, ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం కూడా అని మోదీ తెలిపారు. 130 కోట్ల మంది ప్రజలకు తనలాంటి అవకాశమే ఉందని తను భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Nagarkurnool : ఏనాడు విధులకు రాని డాక్టర్‌.. 4ఏళ్లుగా జీతభత్యాలు.. అసలు కథా ఏంటంటే..?(వీడియో)

 Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత డబుల్ గేమ్? జీవిత ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్.. రాజశేఖర్‌ మాత్రం మంచు ఫ్యామిలీకి టచ్‌లో..(లైవ్ వీడియో)

 ‘శివకార్తికేయన్’ హీరోగా ‘వరుణ్ డాక్టర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..(లైవ్ వీడియో): Sivakarthikeyan Varun Doctor movie

 MAA Elections 2021: అన్నయ్య వల్లే అతనికి మద్దతు.. ‘మా’ ఎన్నికల్లో ఓటుకు పదివేలు..నాగబాబు అదిరిపోయే కామెంట్స్..(లైవ్ వీడియో)

Follow us on