ఏపీ రాజకియాల్లో బ్లాస్టింగ్ న్యూస్.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ పరిణామాలు స్పీడ్‌గా మారుతున్నాయి. తాజాగా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ సారి ఆయన టీడీపీ కోసం పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భేటీపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయి. గతంలో పీకే జగన్ నేతృత్వంలోని వైసీపీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్‌లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు పీకే. అనంతరం.. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్.
యువగళం పేరిట నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. పాదయాత్ర ముగియడంతో పార్టీ ఎన్నికల సన్నద్ధతపై వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టికెట్ల కేటాయింపు, జనసేనతో పొత్త విషయంలో కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల ముందే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది టీడీపీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…