Opposition parties: ప్రతిపక్షాల కూటమికి  INDIA పేరు ఖరారు.. ఈ పోరాటం దేశం కోసమన్న రాహుల్

Opposition parties: ప్రతిపక్షాల కూటమికి INDIA పేరు ఖరారు.. ఈ పోరాటం దేశం కోసమన్న రాహుల్

Ram Naramaneni

|

Updated on: Jul 18, 2023 | 4:47 PM

త్వరలో ముంబయిలో మరోసారి విపక్షాల సమావేశం ఉండనుంది. ఇక UPA ఉండదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రెండు రోజులుగా బెంగళూరులో సమావేశమైన విపక్షాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 

జాతీయ స్థాయిలో 26 విపక్ష పార్టీలు INDIA కూటమిగా ఏర్పాటయ్యాయి. INDIA అంటే ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్‌ అలయన్స్‌. కూటమికి INDIA అని పేరు రాహుల్‌ గాంధీ ప్రతిపాదించారు. రాహుల్‌ ప్రతిపాదనను విపక్షాలు ఆమోదించాయి. ఈ సమావేశానికి మొత్తం 26 పార్టీలు హాజరయినట్లు ఖర్గే తెలిపారు. ఈ దేశ ప్రజల ప్రయోజనాలు పరిరక్షించేందుకు ఈ భేటీ జరిగిందన్నారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.