KTR: ఒడిసిన ముచ్చట.. కవిత సస్పెన్షన్‌పై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..
కవిత అంశం ఒడిసిన ముచ్చట.. ఆ టాపిక్ మళ్లీ తేవొద్దు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చర్చ అనవసరం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అన్నీ చర్చించాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.
కవిత ఎపిసోడ్‌పై ప్రజలకు, క్యాడర్‌కు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కవిత అంశం ముగిసిన ముచ్చట అన్నారు. అన్నీ చర్చించాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. తన సస్పన్షన్ సమయంలో కవిత కేటీఆర్‌కు పలు సూచనలు చేశారు. అన్నా నువ్వు పైలం.. పార్టీ పైలం అంటూ జాగ్రత్తలు చెప్పారు కవిత. కానీ చెల్లి చెప్పిన విషయాలపై అన్న స్పందించలేదు. కాళేశ్వరం విషయంలో కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కవితను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు గులాబీ నేతలు. ఇప్పుడు కేటీఆర్ కూడా క్లారిటీ ఇవ్వడంతో కారు క్యాడర్ కూడా కవితకు పూర్తిగా దూరం జరగనుంది.
Published on: Sep 09, 2025 08:54 AM
