Telangana Congress: కామారెడ్డికి రాహుల్ గాంధీ..? కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ!
హైదరాబాద్ గాంధీభవన్‌లో ఇవాళ్టి కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన విస్తృత సమావేశం జరగనుంది.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు . ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది కాంగ్రెస్.. ఆ మీటింగ్‌కి సంబంధించి ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చించబోతున్నారు.
హైదరాబాద్ గాంధీభవన్‌లో ఇవాళ్టి కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన విస్తృత సమావేశం జరగనుంది.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు . ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది కాంగ్రెస్.. ఆ మీటింగ్‌కి సంబంధించి ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చించబోతున్నారు. 15న నిర్వహించే సభకు రాహుల్ గాంధీ, ఖర్గేలను ఆహ్వానించే యోచనలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలాగే.. భారీ జనసమీకరణ కోసం ప్లాన్ చేస్తున్నారు.. కామారెడ్డి సభకు సంబంధించి నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు.. అలాగే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు..
కాగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించింది కాంగ్రెస్.. ఈ క్రమంలో తమ నిర్ణయాలు, విధానాలను 15న జరిగే సభలో వివరించబోతుంది . మరోవైపు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటుపై సమీక్షిస్తారు.. అలాగే.. పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరగనుంది.. అంతేకాకుండా.. టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్.. ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆయనను నేతలు అభినందించనున్నారు.
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

