News Watch Live: గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ కనిపిస్తే కాల్చివేత.. మణిపూర్‌ వైలెన్స్..

|

May 05, 2023 | 8:26 AM

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ తగులబడుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లర్లను అదుపు చేయడానికి ఆర్మీని రంగం లోకి దింపింది కేంద్రం. అసోం రైఫిల్స్‌ను కూడా పలు ప్రాంతాల్లో మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కన్పిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు.

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ తగులబడుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లర్లను అదుపు చేయడానికి ఆర్మీని రంగం లోకి దింపింది కేంద్రం. అసోం రైఫిల్స్‌ను కూడా పలు ప్రాంతాల్లో మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కన్పిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ఇంఫాల్‌తో సహా పలు ప్రాంతాలో కర్ఫ్యూ విధించారు. మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సాయం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. మణిపూర్‌ సీఎం బీరేంద్రసింగ్‌తో ఫోన్లో మాట్లాడారు అమిత్‌షా. మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్‌ తెగలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!