News Headlines: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని టాప్ న్యూస్.. మీ కోసం

|

Apr 03, 2023 | 9:47 PM

పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ మీటింగ్.. ఢిల్లీలో బిజీ బిజీగా పవన్... కేసీఆర్‌పై జాతీయ జర్నిలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కామెంట్స్... రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు .. హాట్ హాట్ లేటెస్ట్ పొలిటికల్ హెడ్ లైన్స్‌ను ఈ పాడ్‌కాస్ట్‌లో వినేద్దాం పదండి.

తెలుగు న్యూస్ ఛానెల్స్ చరిత్రలో తొలిసారి న్యూస్ పాడ్ కాస్ట్‌తో మీ ముందుకు వస్తోంది టీవీ9 డిజిటల్. ఇవాళ్టి ముఖ్యమైన వార్తల్ని ఇప్పుడు చూద్దాం.. తెలంగాణలో ప్రస్తుతం లీకేజ్ సీజన్ నడుస్తున్నట్టుంది. ఇప్పటికే TSPSC పేపర్ లీక్‌ రాష్ట్రమంతా సంచలనం రేపగా.. తాజాగా ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షా పత్రం కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వికారాబాద్‌ జిల్లాలో తాండూర్‌లో ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమయ్యింది. కాసేపటికే అంటే 9 గంటల 37 నిమిషాలకు పరీక్ష పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది.  ఇలాంటి మరిన్ని వివరాలు.. విషయాలు.. దిగువన వీడియోలో చూడండి

Published on: Apr 03, 2023 09:42 PM