YS Avinash reddy: వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఎంపీ వైఎస్ అవినాష్‌.. సీబీఐ క్లారిటీ.

|

Jun 08, 2023 | 6:53 PM

వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈనెల 5న కౌంటర్‌ దాఖలు చేసింది సీబీఐ. అందులో పలు కీలక అంశాలు ప్రస్తావించింది సీబీఐ. వైఎస్ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది.

వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈనెల 5న కౌంటర్‌ దాఖలు చేసింది సీబీఐ. అందులో పలు కీలక అంశాలు ప్రస్తావించింది సీబీఐ. వైఎస్ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది. ఇంతకుముందు దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పలేదు. తాజాగా  కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని వెల్లడించింది. కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక కుట్రపై దర్యాప్తు సాగుతోందని తెలిపింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ హత్యాస్థలికి వెళ్లారని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.